12న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభం

పలాసలో ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల ఆస్పత్రిని వచ్చే 12న సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో ప్రారంభిస్తామని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • ప్రజాసంఘాలతో కలిసి సందర్శించిన మంత్రి

ప్రజాశక్తి- పలాస

పలాసలో ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల ఆస్పత్రిని వచ్చే 12న సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో ప్రారంభిస్తామని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి బుధవారం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. ఆస్పత్రి పూర్తి స్థాయి పనులు, చేపట్టనున్న వైద్యసేవలు తీరును వారికి చూపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో ఈ ప్రాంత ప్రజలు ఎంతో మంది ప్రాణాలు పోయాయని అన్నారు. దీనిపై శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజా సంస్థల పోరాటం చేయడం, ప్రజలు వినతులు ఇవ్వడంతో జగన్‌ పాదయాత్ర సమయంలో కవిటిలో ముఖాముఖి నిర్వహించి సమస్యను గుర్తించారని అన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారానికి కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు రూ.700 కోట్లతో వంశధార నీరు శుద్ధి చేసి ఇచ్చాపురం వరకు అందించే బృహత్తర ప్రాజెక్టు సిద్ధం చేశామని అన్నారు. సందర్శనలో యుడిఎఫ్‌, వివివి. ఎస్‌విఎస్‌ఎస్‌, న్యూడెమక్రసీ, ప్రగతిశీల, సిపిఐ, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌, రైతు కూలీ సంఘం, జీడి రైతాంగ సంఘం, పలాస యూత్‌ అసోసియేషన్‌, ఎస్‌విఎస్‌ఎస్‌ ఉద్దానం ఫౌండేషన్‌, పలాస లేబర్‌ అసోసియేషన్‌, గ్రీన్‌ఆర్మీ, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

➡️