20లోగా క్లయిమ్‌ల పరిష్కారం

ఈనెల 20వ తేదీలోగా క్లయిమ్‌లను పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజు నుంచి ఇప్పటివరకు 45,179 దరఖాస్తులు

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 20వ తేదీలోగా క్లయిమ్‌లను పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజు నుంచి ఇప్పటివరకు 45,179 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఆన్‌లైన్‌ చేసి ఈనెల 20 తేదీ లోపు పరిష్కరించాలని సూచించారు. ఫారం-6 దరఖాస్తులు 15,687, ఫారం-7 దరఖాస్తులు 16,594, ఫారం-8 దరఖాస్తులు 12,898 ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, సవరణల కింద వచ్చాయని వివరించారు. కొత్తగా ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించిన పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️