పెరటి తోటలు ఆరోగ్యానికి బాటలు

ఇంటి పరిసరాల్లోనే ఒకటికి పది రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, ప్రకృతి వ్వవసాయ సిబ్బంది (ఫైల్‌)

ప్రజాశక్తి- రణస్థలం

ఇంటి పరిసరాల్లోనే ఒకటికి పది రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు ఉంటే ఇక ఆ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం ఉండనే ఉండదని మంచి ఆరోగ్యానికి బాటలని ప్రకృతి వ్వవసాయం ద్వారా ప్రభుత్వం రణస్థలం, లావేరు మండలాల్లో విస్తృతంగా ప్రకృతి వ్వవసాయం చేపడుతుంది. ప్రతి ఇంటి ఆవరణలోనూ కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకోవటం ఆనవాయితీగా వస్తుండేది. ఇప్పుడు పరిస్థితులు ఎంత మారిపోయాయంటే పెరటి తోటలు దాదాపుగా కనుమరుగై పోయాయి. ఇతర వృత్తులు చేసుకునే వారితో పాటు వ్యవసాయ కూలీల కుటుంబాలే కాకుండా రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి వచ్చింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం పెచ్చుమీరి పట్టణాల్లో పేద, మధ్యతరగతి వారి పరిస్థితి ఇంతేనని, పెరటి తోటలు, మేడలపైన ఇంటిపంటల సాగు వైపు దృష్టి సారించడం ద్వారానే ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులోకి తేవటం సాధ్యమవు తుంది. ఎపిలో కమ్యూనిటీ బేస్డ్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం (ఎపిసిఎన్‌ఎఫ్‌) పెరటి తోటల సాగును విస్తృతంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీల కుటుంబాల కోసం వారి ఇళ్ల పరిసరాల్లోనే ‘సూర్యమండలం’ నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పండ్లను ఏడాది పొడవునా సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తుంది.’సూర్యమండలం’ పంటల నమూనా అంటే?సౌరవ్యవస్థను పోలినరీతిలో అంటే గుండ్రని ఆకారంలో ఎత్తు మడులను తయారుచేసి వాటిలో వేర్వేరు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లచెట్లు, ఔషధ మొక్కలు సాగు చేసే పద్ధతి ఇదేనని ప్రకృతి వ్వవసాయం సూచిస్తుం ది. ఎంత స్థలంలోనైనా సూర్య మండలం నమూనాలో పెరటితోటను ఏర్పాటు చేసుకోవచ్చు. విస్తీర్ణం పెరిగే కొద్దీ పంటల వైవిధ్యాన్ని పెంచువచ్చు. పండ్ల మొక్కలను నడి మధ్యలోనే కాకుండా సూర్యమండలం చుట్టూ కూడా వేసు కోవచ్చు. ఇలా ఉండాలంటే కనీసం రెండు సెంట్ల స్థలంలో సూర్యమండలం ఏర్పాటు చేసుకోవటం బాగుం టుంది. అరసెంటు, సెంటు స్థలంలో సూర్య మండలం నమూనాలో ఎత్తుమడులు ఏర్పాటు చేసుకుంటే కుటుంబానికి ప్రతిరోజూ కిలో వరకు కూరగాయలు, ఆకుకూరలు వస్తాయి (అంతస్తుల మాదిరిగా, అన్ని పంటలూ కలిపి)మడులను సిద్ధం చేసుకునేటప్పుడు మట్టిలో ఒక సెంటు స్థలంలో సుమారు 50 కిలోల చొప్పున ఘన జీవామృతాన్ని కలపాలి. ప్రతి 15 రోజులకొకసారి మడుల్లో మొక్కలు పూర్తిగా తడిసేటట్లు ద్రవజీవామృతాన్ని పిచికారీ చేయాలి. ఒక వేళ పంటలపై చీడపీడల బెడద ఎక్కవగా ఉంటే అవసరాన్ని బట్టి కషాయాలను పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలి. పంటలను కాలానుగుణంగా మార్పిడి చేసుకోవాలి. ఒక మడిలో వేసిన పంటల కాపు పూర్తయ్యాక అక్కడ మళ్లీ అవే పంటలు వేయకూడదు. అంతర పంటలను ఎన్ను కునేటప్పుడు మిత్ర పంటలు పక్క పక్కన ఉన్నట్లయితే మొక్కల ఎదుగుదల బాగుంటుంది. సూర్య మండలం మడుల్లో 365 రోజులూ పంటలు ఉండేలా కొద్ది వారాల వ్యవధిలో విత్తనాలు, మొక్కలు నాటుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. కాలాను గుణమైన పంటల సరళి ఎంపికే ముఖ్యం. ప్రతిమడిలో పంటల వైవిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య సంబంధాలు, సూక్ష్మజీవులతో సహ జీవనం అనే ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రాలను ఇక్కడ అనుసరించాలని ప్రకృతి వ్వవసాయ సిబ్బంది సూచిస్తూ న్నారు. సూర్య మండలం మధ్యలో వల యాకారంలో ఉన్న మడిలో తక్కువ నీడనిచ్చే పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు ఉదాహరణకు అరటి, బొప్పాయి. సూర్యమండలం మధ్యలో నీటిపంపు వచ్చేలా బాగుంటుంది. మధ్యలో నుంచి చివరి మడుల వరకు వాలు ఉన్నట్లయితే, నీరు అన్ని చోట్లకు సులువుగా చేరుతుంది. ఎక్కువ అయిన నీరు బయటకు పోయే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఎత్తు మడులు చేసుకొని, చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకొంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. మడుల మధ్య కాలి బాటలపై పందిరి వేసుకొంటే తీగ జాతి మొక్కలను ఎగ పాకించు కోవచ్చును. సూర్యమండలం చుట్టూ కంచే ఉంటే పశువుల నుంచి రక్షణగా ఉంటాయి. తీగ జాతి మొక్కలను కంచెకు పాకించవచ్చు. మడుల అంచుల్లో దుంప జాతి మొక్కలు, ప్రతి మడిలో ఒక వరుసలో ఒక కాయగూర పంట, రెండు కాయగూర మొక్కల మధ్యలో ఆకు కూరలు విత్తుకొని పండించుకోవచ్చు.కషాయాలతో పంటల సాగుసొంతంగా తయారు చేసుకునే ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలతోనే పంటల సాగు చేసుకోవచ్చు. రకరకాల దేశవాళీ కూరగాయ వంగడాల పరిరక్షణ సాధ్యమవుతుంది. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు కూరగాయలు, ఔషధాలు కొనే ఖర్చు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. అయితే, ఇంటి దగ్గర తగినంత చోటు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వారికి ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ కిచెన్‌ గార్డెనింగ్‌ ప్లాట్స్‌ కేటాయించి, సూర్యమండల నమూనాలో కూరగాయల సాగును ఎపి రైతు సాధికార సంస్థ ప్రోత్సహిస్తుంది. తీగ జాతి పాదులు పాకడానికి పందిళ్లు వేయాలి. సూర్యమండలం చుట్టూ కంచెకు కూడా పాకించవచ్చు, పందిళ్లకు తీగ జాతి మొక్కలను తొలి దశలో జాగ్రత్తగా పాకించాలి. కూరగాయ మొక్కల మధ్యలోనూ నేలపై పాకే గలిజేరు వంటి ఆకుకూర మొక్కలను పెంచుకోవచ్చు, సజీవ ఆచ్ఛాదనగా కూడా పనికివస్తుంది. ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి.

ప్రయోజనాలు ఎన్నో…

‘సూర్యమండలం’ ప్రయోజనాలు ఏడాది పొడవునా తాజా కూరగాయల లభ్యత. దూరప్రాంతాల నుంచి ఇంధనం ఖర్చు చేసి కూరగాయల రవాణా చేయాల్సిన అవసరం ఉండదు. పెరటితోట ఉన్న కుటుంబానికి ఏడాది పొడవునా సమతుల ఆహారం అందుతుంది. పౌష్టికాహార లభ్యత వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్య ఖర్చులు తగ్గు తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార భద్రత పెరుగు తుంది. కుటుంబానికి రోజుకు ఒక కిలో కూరగాయలు, పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.

 

➡️