చెక్‌పోస్టు తనిఖీ

జిల్లా సరిహద్దుగా ఉన్న మెళియాపుట్టి

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- మెళియాపుట్టి

జిల్లా సరిహద్దుగా ఉన్న మెళియాపుట్టి మండలంలో గోప్పిలి-రంపకానా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును ఎస్‌పి జి.ఆర్‌.రాధిక శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ మేరకు వాహనాల రాకపోకలు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం, నాటుసారా, గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈమె వెంట టెక్కలి డిఎస్‌పి డి.బాలచంద్రారెడ్డి, పాతపట్నం సిఐ నల్లి సాయి, ఎస్‌ఐ టి.రాజేష్‌, ఎఎస్‌ఐలు నరసింగరావు, అప్పన్న ఉన్నారు. అలాగే సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి పోలింగ్‌ స్టేషన్ల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ప్లయింగ్‌ స్కాడ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

 

 

➡️