ఘనంగా రన్ ఫర్ జీసస్

Mar 30,2024 12:28 #srikakulam

ప్రజాశక్తి – ఆమదాలవలస :- మున్సిపాలిటీ మరియు మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహణలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణ శివారున ఉన్న వైస్సార్ కూడలి నుండి పట్టణంలోని మెయిన్ రోడ్డు గుండా కృష్ణాపురం వరకు ఏసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్దాన సువార్త యాత్రను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది దైవజనులు ఏసుక్రీస్తు ప్రభువు గొప్పతనాన్ని గురించి కొనియాడుతూ గీతాలాపనలు చేస్తూ ప్రభువు జనన మరణ పునరుద్దానమును గూర్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది వరకు క్రైస్తవ బిడ్డలు హాజరై ప్రభువును కీర్తిస్తూ ఘనపరిచిరి.

➡️