చంద్రబాబు సభాస్థలి పరిశీలన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా

వివరాలు సేకరిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- పలాస

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15న పలాసలో రోడ్‌ షో సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వా జూనియర్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌, సభాస్థలిని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక శనివారం పరిశీలించారు. ఇందిరాచౌక్‌, రోడ్‌ చేసే ప్రాంతాలనూ పరిశీలించారు. ఇందిరాచౌక్‌ వద్ద సభ నిర్వహణ జరగడానికి ఏర్పాట్లు చేయడంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ వైర్ల సమస్య ఉన్నట్టు గుర్తించారు. వాటిని సరిచేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌ స్థలాలు, విఐపి పార్కింగ్‌ ప్రాంతాలు గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని డిఎస్‌పి నాగేశ్వరరెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. చుట్టూ బారికేట్లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలన్నారు. ఆమె వెంట సిఐ విజయానంద్‌, ఎస్‌ఐ పారినాయుడు ఉన్నారు. గౌతు శిరీషచంద్రబాబునాయుడు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష కోరారు. ఈ మేరకు ఆమె చంద్రబాబు పర్యటించే ప్రాంతాలు, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ఆమె వెంట వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గురిటి సూర్యనారాయణ, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్‌గుప్త, మల్లా శ్రీనివాస్‌, జోగ మల్లి పాల్గొన్నారు.

 

➡️