చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు

ఎన్‌డిఎ కూటమి నేతలు ఇస్తున్న అమలు కాని

ఆమదాలవలస : పోస్టర్లను పంపిణీ చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్న సీతారాం

ఆమదాలవలస:

ఎన్‌డిఎ కూటమి నేతలు ఇస్తున్న అమలు కాని హామీలను ప్రజలు నమ్మరని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం పట్టణంలోని మెట్టక్కివలసలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి వైసిపిని ఆదరించాలని ప్రజలను కోరారు. అనంతరం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి జన రంజక పాలనను అందించిన వైసిపికి పట్టం కట్టడానికే ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను శతశాతం నేరవేర్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, అజంతా కుమారి, అత్తులూరి రవికాంత్‌, ముత్తా విజరు, మరాఠీ వెంకటేష్‌, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, మామిడి రమేష్‌, దుంపల శ్యామలరావు పాల్గొన్నారు.పలాస: తాను ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సమయంలో పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,12 వార్డుల్లో గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశీబుగ్గ రైల్వే వంతెన పూర్తి చేయకుండా గత పాలకులు ఎన్నో ఏళ్లుగా విడిచి పెడితే… తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే వంతెన నిర్వాసితులకు న్యాయం చేశానని అన్నారు. ప్రస్తుతం రైల్వే వంతెన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. పలాస-కాశీబుగ్గ కెటి రోడ్డు విస్తరణ పనులు పూర్తి ప్రజలకు అంకితం చేశామన్నారు. తాను ఇచ్చిన హామీలో రైతుబజార్‌ ఏర్పాటు చేయలేకపోయానని, తాను మరలా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైతుబజార్‌ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పేరాడ తిలక్‌ను ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హనుమంతు వెంకటరావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డబ్బీరు భవానీశంకర్‌, కౌన్సిలర్లు గుజ్జు జోగారావు, దుర్గా శంకర్‌ పండా, పోతనపల్లి ఉమాకుమారి, శార్వాణి గీత, వైస్‌ చైర్మన్లు మీసాల సురేష్‌బాబు, బోర కృష్ణారావు, మాజీ కౌన్సిలర్‌ రోణంకి శాంతికుమారి, రొక్కెం హైమావతి, పోతనపల్లి హరి, బోర చంద్రకళ, సనపల సింహాచలం పాల్గొన్నారు. పాతపట్నం : మండలంలోని పెద్దసీది, తామర, తీమర పంచాయతీల్లో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి సవిరిగాన ప్రదీప్‌, ఎఎంసి చైర్మన్‌ కొండల అర్జునరావు, సచివాలయాల కన్వీనర్‌ సూర్యం పాల్గొన్నారు. సంతబొమ్మాళి : మండలంలోని కొల్లిపాడు పంచాయతీలో కొల్లిపాడు, గంటపేట, సీపురం, సుగ్గువానిపేట, సిమ్మయ్యపేట గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, వైస్‌ ఎంపిపి ప్రతినిధిలు నక్క భీమారావు, పొందల రామకృష్ణ, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు కోత సతీష్‌, కొల్లిపాడు సర్పంచ్‌ ప్రతినిధి గొరుసు సవరయ్య, ఎంపిటిసి ప్రతినిధి బొంగు కొండయ్య, రమణ, చాట్ల నూకయ్య పాల్గొన్నారు. కవిటి: మండలంలోని కవిటిలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ రామారావు, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు పాల్గొన్నారు. మెళియాపుట్టి : వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతికి మద్దతుగా ఆమె తనయుడు రెడ్డి శ్రావణ్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకింగ్‌ చేస్తున్న వారిని, పలువురు వ్యాపారులను, టీ దుకాణం వద్దకు వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంపిపి ప్రతినిధి ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగి, శశి భూషణరావు, రాజశేఖరరెడ్డి, ప్రకాష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

➡️