జెవివి పీపుల్స్‌ మేనిఫెస్టో విడుదల

ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యాన జ

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న జెవివి, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యాన జనవిజ్ఞాన వేదిక రాష్ట్రంలో పీపుల్స్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో పీపుల్స్‌ మేనిఫెస్టోను జెవివి, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జెవివి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ హాజరై మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పర్యావరణం, శాస్త్రీయ దృక్పథం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నీటివనరులు, వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ తదితర అంశాలపై జనవిజ్ఞాన వేదిక పీపుల్‌ మేనిఫెస్టోను సిద్దం చేసిందన్నారు. ఆర్ధిక అసమానతలు, కుల, మత వివక్షత లేని విజ్ఞాన, ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌, జెవివి సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోను పాలకులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శాస్త్రీయ దృక్పధ ప్రచారం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 ఎ హెచ్‌ అమలుకు కృషి చేయాలన్నారు. మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు పీపుల్స్‌ మేనిఫెస్టోను అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు పూర్వ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, హెడ్మాస్టర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వి.సత్యనారాయణ, నాయకులు బోడసింగి ఖగేశ్వరరావు, డిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పూజారి హరి ప్రసన్న, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్మాస్టర్స్‌ అసోస ియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బలివాడ ధనుం జయరావు, జిల్లా ఎన్‌జిసి కో-ఆర్డినేటర్‌ పూజారి గోవిందరావు, పోస్టల్‌ యూని యన్‌ జిల్లా కార్యదర్శి గణపతి, ఎపి మోడల్‌ స్కూల్స్‌ జిల్లా నాయకులు పప్పు రాజు, జెవివి జిల్లా కోశాధికారి విఎస్‌ కుమార్‌, జనవిజ్ఞాన వేదిక ఆడిట్‌ కన్వీనర్‌ బోగెల ఉమా మహేశ్వరరావు, సమత జిల్లా కన్వీనర్‌ తంగి ఎర్రమ్మ, కో-కన్వీనర్‌ వేదవతి, పర్యావరణ సభ కమిటీ కన్వీనర్‌ అగతముడి వాసుదేవరావు పాల్గొన్నారు.

 

➡️