సాగునీరు అందేనా!

గత ఖరీఫ్‌ సీజన్‌ సాగునీరు

పిచ్చి మొక్కలతో నిండి ఉన్న కాలువ

ప్రజాశక్తి- సంతబొమ్మాళి

గత ఖరీఫ్‌ సీజన్‌ సాగునీరు అందక తీర ప్రాంత పంచాయతీ రైతులు తీవ్ర అబ్బందులు పడ్డారు. వచ్చే ఖరీఫ్‌కైనా రైతులకు సాగునీరు అధికారులు అందిరా? అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని మేఘవరం ఆర్‌ కాలువకు సంబంధించి జిజి ఛానల్‌ ద్వారా మరువాడ, మేఘవరం, కె.లింగూడు, మూలపేట, కొల్లిపాడు, లక్కివలస పంచాయతీల్లో 15 వందల ఎకరాలకు సాగునీరు అందించడంలో వంశధార అధికారులు గతేడాది విఫలమ య్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గత ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌లో తేలిక పాటి వర్షాలు పడడంతో కొంతమంది రైతు లు వరి నాట్లు వేశారు. జులైలో ఇంజిన్లతో మరికొంత మంది రైతులు వరి నాట్లు వేశారు. వరి నాట్లు వేసిన తరువాత వర్షా లు కురవక, చెరువుల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు, స్థానిక నాయకులకు రైతులు మొర పెట్టుకున్నా కనీసం చుక్కనీరు అందించలేక పోయారు. వంశధార అధికారులు ఏప్రిల్‌, మే నెల్లో వంశధార కాలువలు మరమ్మతు లు చేయకుండా ఆగస్టులో వచ్చి తూతూ మంత్రంగా చూసి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయి. పాలతలగాం నుంచి మూలపేట వరకు కనీసం కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, జంగిల్‌ను తొలగించ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది నుంచి ఈ తీర ప్రాంత పంచాయతీలకు సాగునీరు అందిం చకుండా… రెవెన్యూ అధికారులు రైతులపై ఒత్తిడి చేసి మరీ శిస్తు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిజి ఛానల్‌ మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకుండా నిమ్మకునీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని రైతులు చెబుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తీర ప్రాంత పంచాయతీ పొలాలకు ఈ ఏడాదైనా సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

➡️