వైసిపికి వరం కుటుంబసభ్యుల రాజీనామా

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి

వరం వారసులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల వలన అన్నివర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని కీ.శే మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అంధవరపు వరహా నరసింహం(వరం) కుమార్తె, మున్సిపల్‌ మాజీ చైర్పర్సన్‌ పైడిశెట్టి జయంతి, ఆమె సోదరులు అంధవరపు ప్రసాద్‌, అంధవరపు సంతోష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి సమపాలలో జరుగుతుందని విశ్వసిస్తూ టిడిపిలో చేరనున్నట్టు ప్రకటించారు. 2000-2005 శ్రీకాకుళం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు విజయవంతంగా పనిచేయడానికి చంద్రబాబు, దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రంనాయుడు తమకు అవకాశం కల్పించి గౌరవించారని తెలిపారు. ఈనెల 28న ఉదయం 8 గంటలకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి గొండు శంకర్‌ సమక్షంలో టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వరం అనుచరులు, ఆప్తులు తమ కుటుంబానికి సన్నిహితులు, తాము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

 

➡️