కేసుల దర్యాప్తు వేగవంతం

పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – సరుబుజ్జిలి

పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని, దిశానిర్దేశం చేశారు. నాటుసారా, గంజాయి వంటి మాదకద్రవ్యాలు క్రయ, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టప్రకారం బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. బాధితులు, ఫిర్యాదుదారులపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్‌పి శ్రుతి, సిఐ దివాకర్‌, ఎస్‌ఐ బి.నిహార్‌ పాల్గొన్నారు.

 

➡️