టెక్నివెర్స్ టెక్నికల్ పెస్ట్

Apr 6,2024 13:05 #srikakulam

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : విజ్ఞానం, వినోదంతో కూడిన టెక్ని వెర్స్  నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కెవిజిడి బాలాజీ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వివిధ కళాశాలల విద్యార్థులతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంలో ఈ నెల 12,13,14 తేదీల్లో టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కెవిజిడి బాలాజీ అన్నారు. డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ టెక్ని వెర్స్ టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు అందుకు అందరి భాగస్వామ్యలు కావాలన్నారు, టెక్నీకల్ వర్క్ షాప్ లో ఈ వి వెహికల్స్, డ్రోన్ సర్వేయింగ్, ప్రాజెక్ట్ ఎక్సపో, ఫోన్ ఫార్జ్, టెక్ అరేనా, టెక్ ఫేట్, వెబ్ డిజైన్ తోన్, కన్సలే హాక్, కాగానితో కోడ్, అన్వేషక, మైండ్ టెంటాకల్స్, ఎలక్ట్రిక్కింగ్, సర్క్యూరిటీరి, స్పార్క్ యువర్ బ్రెయిన్,డిజైన్ డేర్బై తో ఏర్పాట్లు చేయడమే కాకుండా, విజ్ఞాన ప్రదర్శన, వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, వినోదం అందించే ఉదేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో OSD సుధాకర్ బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ,డీన్ మోహన్ కృష్ణ చౌదరి,ఫైనాన్స్ ఆఫీసర్ ఆసిరి నాయుడు,వెల్ఫేర్ డీన్ రవి,ఫెస్ట్ కన్వీనర్ వాసు, కో కన్వీనర్ దిలీప్ కుమార్, ఆర్గనైజయింగ్ సెక్రటరీ  రమణ , పి ఆర్ ఓ మామిడి వివిధ డిపార్ట్ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు

➡️