శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనం ధ్వంసం

Apr 10,2024 00:18

ప్రజాశక్తి – రెంటచింతల : టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరా యలు ప్రచారం వాహనంపై దుండగులు మంగళవారం రాత్రి దాడి చేశారు. మండలంలోని మంచికల్లులో డిజిటల్‌ ప్రచారం వాహనం ప్రచారం ముగించుకుని వెళ్తుండగా గ్రామ శివారులో కొందరు దాడి చేశారు. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌ మాత్రమే ఉన్నారు. దాడిని డ్రైవర్‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపైనా దాడి చేశారు. డిజిటల్‌ స్క్రీను, మిషను, ఇతర యంత్రాలను ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలను చింపారు. దీనిపై టిడిపి మండల అధ్యక్షులు చపారపు అప్పిరెడ్డి రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనా న్ని ఎఎస్‌ఐ హనుమంత రావు పరిశీ లించి విచా రణ చేస్తున్నారు.

➡️