టిడిపిలోకి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌

ప్రజాశక్తి-చీరాల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రజా బంధు ప్రగడ కోటయ్య మనవడు, స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాసరావు టిడిపికి మద్దతు తెలుపుతూ తన పోటీని విరమించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్యకు మద్దతు తెలియజేసి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా కొండయ్య శ్రీనివాస్‌కు తెలుగుదేశం కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసుతో ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అని చీరాల అభ్యర్థి కొండయ్య గెలుపు కోసం కృషి చేసేందుకు తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ నియోజవర్గ ప్రజలు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విశ్వసిస్తూ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాల వలన ప్రతి ఇంటికి ‘సంక్షేమం’ అందుతుందని, ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తనకు మద్దతు తెలియజేస్తున్న నియోజవర్గ ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన వెంట డాక్టర్‌ సజ్జా హేమలత, 5వ వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️