కాంగ్రెస్‌తోనే’ఉక్కు’ కల సాకారం

ప్రజాశక్తి – కడప ప్రతినిధికడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఎఐసిసి నాయకులు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని పుత్తా ఎస్టేట్‌లో పిసిసి మీడియా కమిటీ చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి బిజెపి ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం నెరవేర్చుతుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ నా తండ్రికి సోదరుడని తెలిపారు. రాజీవ్‌, వైఎస్‌ఆర్‌ బంధం అన్నదమ్ముళ్ల బందం. ఈ బంధం చాలా ఏళ్ల కిందటి నుంచి ఉందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తితో భారత్‌జోడో యాత్ర సాగించానని తెలిపారు. దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని వైఎస్‌ఆర్‌ చెప్పారన్నారు. వైఎస్‌ఆర్‌ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశాడని తెలిపారు. ఇప్పుడు ఎపీలో సామాజిక న్యాయం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ ఢిల్లీలో ఎపి హక్కుల కోసం పోరాటం చేసేవారని తెలిపారు. జగన్‌ మాత్రం బిజెపికి మద్దతు ఇస్తున్నాడన్నారు. బిజెపిని ఒక్క మాట అనలేరని, వారి అవినీతి బయట పడుతుందనే భయమని విమర్శించారు. ఎపి ఆత్మగౌరవం బిజెపి ముందు తలదించుకుందని ఎద్దేవా చేశారు. ఇదే భయం చంద్రబాబుకూ ఉందన్నారు. మేము కోట్లాది మందిని లక్షలాధికారులను చేస్తుంటే మోడీ సోమరిపోతులను తయారు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ బిడ్డ షర్మిల ఇవ్వాళ మీముందు నిలబడిందని చెప్పారు. తనచెల్లెలి తరుపున వాగ్దానం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నానని విజ్ఞప్తి చేశారు. తనచెల్లి పార్లమెంట్‌లో ఉంటే ఎపి హక్కులు ప్రతిధ్వనిస్తాయని చెప్పారు.సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ తల్లి, చెల్లెల్ని బాధిస్తూ ఓ నికృష్టుడిని వెంటేసుకుని తిరగడందా రుణమన్నారు. గొడ్డలి రాజకీయాన్ని ప్రజలు ఓడించాలని విజ్ఞప్తి చేశారు. దేనికీ పనికిరాని ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్ట్‌ను ఎందుకు తెచ్చారో తెలియడం లేదని యాక్ట్‌లోని నిబంధనల్ని చదివి వినిపించారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ విభజన హామీల్ని నెరవేర్చని బిజెపికి తొత్తులుగా మారడంలోని ఔచిత్యమేమిటో తెలియడం లేదన్నారు. జగన్‌ సంక్రాంతికి జాబ్‌ కేలండర్‌ అన్నాడని ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలు తప్పా మరొకటి లేదన్నారు. వైఎస్‌ వివేకా కేసులో నిందితుడిని పక్కన బెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్‌ జగన్‌ మారిపోయాడని తెలిపారు. వైఎస్‌ఆర్‌ మరణం వెనక రిలయన్స్‌ హస్తం ఉందని చెప్పాడని, ముఖ్యమంత్రి అయ్యాక వాళ్లనే పిలిచి ఎంపీ పదవులు ఇచ్చాడని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పేరును సిబిఐ ఛార్జీషీట్‌లో చేర్పించాడన్నారు. కడప పార్లమెంట్‌ ఎన్నిక వైపు ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా? నేరాన్ని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ పాలన తిరిగి తెస్తానన్నారు. కడప ఎన్నిక న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటమని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటోందన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి, మత సామరస్యాన్ని మంట గలుపుతుందని హెచ్చరించారు. దేశ సమగ్రత, సమైక్యతలను దెబ్బ తీస్తుందని చెప్పారు. ఇటువంటి బిజెపిని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇండియావేదిక అధికారంలోకి వస్తే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, కమలాపురం ఇండియావేదిక అభ్యర్థి గాలి చంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం, ఉక్కు పరిశ్రమ వంటి హామీలు అమలు కాలేదన్నారు. కడప కాంగ్రెస్‌ అభ్యర్థి ఆప్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ దేశానికి అవసరం ఏర్పడిందని తెలిపారు. అన్ని తరగతులకు న్యాయం దక్కాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. రాయచోటి కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లా బకాష్‌ మాట్లాడుతూ దేశంలో 40 లక్షల మంది మహిళల ఆచూకీ కనిపించడం లేదన్నారు. మణిపూర్‌లో మహిళల్ని నగంగా ఊరేగిస్తే ఖండించిన పాపాన పోలేదని బిజెపినుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్‌, కర్నాటక డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్‌, మాణిక్యం ఠాగూర్‌, కెవిపి రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాధ్‌, మాజీ మంత్రి అహ్మదుల్లా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ ఓబులేసు, కడప, అన్నమయ్య జిల్లాకు చెందిన పార్లమెంట్‌ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు.వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన రాహుల్‌ ప్రజాశక్తి – వేంపల్లె దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఘాట్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్ట్‌కు కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంట్‌ అభ్యర్థి, పిసిసి ఛీప్‌ షర్మిలతో కలిసి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ విచ్చేశారు. అనంతరం కడప ఎయిర్‌ పోర్ట్‌ నుండి హెలికాప్టర్‌లో రాహుల్‌ గాంధీ, షర్మిల ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సలహాదారుడు కెవిపి రామచంద్రరావు, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ రాహుల్‌ గాంధీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్‌ నుండి ప్రత్యేక క్యాన్వావ్‌ ద్వారా వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద దాదాపు అరగంట పాటు ప్రార్థనలు చేశారు. వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద వైఎస్‌ఆర్‌ గురించి షర్మిల, రాహుల్‌గాంధీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహనికి రాహుల్‌ గాంధీ పూల మాలలతో నివాళులర్పించారు. హక్కులు ప్రతిధ్వనిస్తాయని చెప్పారు.సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ తల్లి, చెల్లెల్ని బాధిస్తూ ఓ నికృష్టుడిని వెంటేసుకుని తిరగడందా రుణమన్నారు. గొడ్డలి రాజకీయాన్ని ప్రజలు ఓడించాలని విజ్ఞప్తి చేశారు. దేనికీ పనికిరాని ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్ట్‌ను ఎందుకు తెచ్చారో తెలియడం లేదని యాక్ట్‌లోని నిబంధనల్ని చదివి వినిపించారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ విభజన హామీల్ని నెరవేర్చని బిజెపికి తొత్తులుగా మారడంలోని ఔచిత్యమేమిటో తెలియడం లేదన్నారు. జగన్‌ సంక్రాంతికి జాబ్‌ కేలండర్‌ అన్నాడని ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలు తప్పా మరొకటి లేదన్నారు. వైఎస్‌ వివేకా కేసులో నిందితుడిని పక్కన బెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్‌ జగన్‌ మారిపోయాడని తెలిపారు. వైఎస్‌ఆర్‌ మరణం వెనక రిలయన్స్‌ హస్తం ఉందని చెప్పాడని, ముఖ్యమంత్రి అయ్యాక వాళ్లనే పిలిచి ఎంపీ పదవులు ఇచ్చాడని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పేరును సిబిఐ ఛార్జీషీట్‌లో చేర్పించాడన్నారు. కడప పార్లమెంట్‌ ఎన్నిక వైపు ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా? నేరాన్ని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ పాలన తిరిగి తెస్తానన్నారు. కడప ఎన్నిక న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటమని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటోందన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి, మత సామరస్యాన్ని మంట గలుపుతుందని హెచ్చరించారు. దేశ సమగ్రత, సమైక్యతలను దెబ్బ తీస్తుందని చెప్పారు. ఇటువంటి బిజెపిని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇండియావేదిక అధికారంలోకి వస్తే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, కమలాపురం ఇండియావేదిక అభ్యర్థి గాలి చంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం, ఉక్కు పరిశ్రమ వంటి హామీలు అమలు కాలేదన్నారు. కడప కాంగ్రెస్‌ అభ్యర్థి ఆప్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ దేశానికి అవసరం ఏర్పడిందని తెలిపారు. అన్ని తరగతులకు న్యాయం దక్కాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. రాయచోటి కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లా బకాష్‌ మాట్లాడుతూ దేశంలో 40 లక్షల మంది మహిళల ఆచూకీ కనిపించడం లేదన్నారు. మణిపూర్‌లో మహిళల్ని నగంగా ఊరేగిస్తే ఖండించిన పాపాన పోలేదని బిజెపినుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్‌, కర్నాటక డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్‌, మాణిక్యం ఠాగూర్‌, కెవిపి రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాధ్‌, మాజీ మంత్రి అహ్మదుల్లా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ ఓబులేసు, కడప, అన్నమయ్య జిల్లాకు చెందిన పార్లమెంట్‌ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు.వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన రాహుల్‌ ప్రజాశక్తి – వేంపల్లె దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఘాట్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్ట్‌కు కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంట్‌ అభ్యర్థి, పిసిసి ఛీప్‌ షర్మిలతో కలిసి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ విచ్చేశారు. అనంతరం కడప ఎయిర్‌ పోర్ట్‌ నుండి హెలికాప్టర్‌లో రాహుల్‌ గాంధీ, షర్మిల ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సలహాదారుడు కెవిపి రామచ ంద్రరావు, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ రాహుల్‌ గాంధీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్‌ నుండి ప్రత్యేక క్యాన్వావ్‌ ద్వారా వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద దాదాపు అరగంట పాటు ప్రార్థనలు చేశారు. వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద వైఎస్‌ఆర్‌ గురించి షర్మిల, రాహుల్‌గాంధీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహనికి రాహుల్‌ గాంధీ పూల మాలలతో నివాళులర్పించారు.

➡️