శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు : సిఐ

May 26,2024 20:34

ప్రజాశక్తి – పాలకొండ : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని సిఐ ఎం.చంద్రమౌళి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోనిరెల్లివీధి ప్రాంతంలో ఆదివారం కార్డన్‌ చర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీ చేశారు. అనుమతిలేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు, పెట్రోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అదే విధంగా లూజు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా విక్రయాలు కూడా ఎవరూ చేపట్టరాదన్నారు. ప్రతిరోజూ తెల్లవారు జామున కవాతు చేపట్టడం జరుగుతుందన్నారు.

➡️