కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి-రాయచోటి పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్‌పి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై దష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లలో విద్యుత్‌ సౌకర్యం, సిసిటివి కెమెరాలను అమర్చ డంతో పాటు బ్యారికేడింగ్‌ పటిష్టంగా ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కూర్చునేందుకు చుట్టూ బారికేడింగ్‌, అభ్యర్థులు, ఏజెంట్లు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక దారి, రిసెప్షన్‌ సెంటర్‌, తదితర ఏర్పాట్లను ఇసి సూచించిన నిబంధనల మేరకు ప్రణాళిక బద్ధంగా ఉండాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ క షా?రావు మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూముల దగ్గర కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతర నిఘా ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ సరళి పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎఎస్‌పి డాక్టర్‌ రాజ్‌ కమల్‌, ఆర్డీవోలు, ఎన్నికల నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️