గురజాడ వేషధారణలో అలరించిన విద్యార్దులు

Nov 29,2023 14:50 #Vizianagaram
students in gurajada apparao getups

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : “గురజాడ వర్ధంతి ” సందర్భంగా బుధవారం స్థానిక గురజాడ పాఠశాలలో “గురజాడ వేష ధారణ ” ఫ్యాన్సీ డ్రస్ పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ కాంపిటీషన్ లో ఎల్ కె జి నుండి 5వ తరగతి వరకు 50 మంది విద్యార్థులు గురజాడ వేషధారణ పోటీలో పాల్గొనడం జరిగినది. ఈ వేషధారణలో పాల్గొన్న విద్యార్థులందరికీ జెవివి అధ్యక్షులు, పాఠశాల డైరెక్టర్ డాక్టర్. ఎంవి ఆర్ కృష్ణాజీ, పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, ప్రధానోపాధ్యాయులు పూడి.శేఖర్, స్కూల్ ఏఓ. ఏఎన్.నాయుడు బహుమతి ప్రధానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా హై స్కూలు విద్యార్థులందరికీ గురజాడ అప్పారావు జీవిత చరిత్రపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగినది.

➡️