ఘణనీయంగా తగ్గిన వేరుశనగ సాగు

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ సాగు ఘణనీయంగా తగ్గింది. రైతులు గతంలో వేసవిలో అధికంగా వేరుశనగ సాగు చేసేవారు. మం డల వ్యాప్తంగా వేసవిలో 1000 హెక్టార్లలో వేరుశనగ పం టను సాగు చేసేవారు. ముఖ్యంగా వెదురూరు, రాజుపాలెం, నరహరి పురం, కుచ్చుపాప, అయ్యవారిపల్లె, రాజువారిపేట, అనంతపురం తదితర గ్రామాల్లో రైతులు వేరుశనగ పంటను సాగు చేసేవారు. ఈ ఏడాది వంద ఎకరాలలోపే సాగైంది. సాగు చేసిన కొద్దీ మొత్తం వేరుశనగ పంట కూడా నీరు లేక ఎండు ముఖం పడు తోంది. సాధారణంగా ఎకరాకు 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది తెగుళ్ల బెడద, సాగు నీరు సరిగా లేక దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో సాధారణంగా రైతులు వేరుశనగతోపాటు నువ్వు, పెసర, మిను ము వంటి పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది అన్ని రకాల పంటల సాగు తగ్గుముఖం పట్టింది. బోరు బావులు అం దుబాటులో ఉన్న రైతులు కూడా పంటల సాగుకు దూరంగా ఉంటున్నారు. అక్కడక్కడ సాగుచేసిన వరి పంట కూడా నీరు సరిగా లేక ఎండుతోంది.

➡️