గిరిజన గ్రామాల్లో జోనల్‌ అధికారి సందర్శన

Jun 18,2024 21:45

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పొల్లరేయి, మానుగూడ, టిటికిపాయి, మానాపురం తదితర గిరిజన గ్రామాల్లో మలేరియా జోనల్‌ అధికారి శాంతికుమారి మంగళవారం సందర్శించారు. మలేరియా కేసులు అధికంగా ఉండడంతో తనిఖీలు చేపట్టారు. కాలువలు శుభ్రపర్చాలని సంబంధించిన సిబ్బందికి ఆదేశించారు. మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాలన్నారు. అలాగే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. మలేరియా కేసులపై సకాలంలో వైద్యసేవలందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును అభినందించారు. గత ఏడాది ఈ ప్రాంతంలోనే మలేరియా కేసులు అధికంగా వచ్చాయన్నారు. కావున హైరిస్క్‌ గ్రామాల్లో మలాథియన్‌ పిచికారీ తప్పనిసరిగా చేయాలన్నారు.

➡️