ప్రజా సంక్షేమానికి మద్దతు ఇవ్వండి

Apr 26,2024 21:40

 ప్రజాశక్తి-బొబ్బిలి: వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమానికి మద్దతు ఇవ్వాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. పట్టణంలోని 19వ వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వారు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి సిఎం జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. ప్రచారంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️