లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించండి : సిఐ సన్యాసినాయడు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి, జడ్డంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజల వద్ద నాటుతుపాకులు, ఎటువంటి లైసెన్సు లేని ఆయుధాలు ఉన్నట్లయితే వారం రోజులలోపు సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో స్వచ్ఛందంగా డిపాజిట్‌ చేయాలని స్థానిక సీఐ సన్యాసినాయుడు మంగళవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లైసెన్స్‌ లేకుండా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగివుంటే వారి సమాచారాన్ని పోలీస్‌లకు తెలపాలని కోరారు.

➡️