ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : చిత్తూరు ఎంపి

Nov 23,2023 15:04 #Chittoor District, #cm jagan

ప్రజాశక్తి-చిత్తూరు : సిఎం జగన్‌ తాడేపల్లి క్యాంపుకార్యాలయం నుండి 4వ విడత వై.యస్‌.ఆర్‌ కళ్యాణ మస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్తూరు జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి చిత్తూరు ఎంపి ఎన్‌. రెడ్డెప్పతో పాటు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్‌ అముద, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రమ్య, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుమార రాజా, సంబంధింత అధి కారులు,ప్రజా ప్రతినిధులు,లబ్ది దారులు,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డెప్ప మాట్లాడుతూ వైఎస్సార్‌ కళ్యాణ మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయాన్ని అందుకున్న లబ్ధిదారులు దీనిని సక్రమమైన రీతిలో ఉపయోగించుకుని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలను పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివద్ధిని తన తోటి వారికి వివరించాలని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కు సూచించారు. కలెక్టర్‌ ఎస్‌. షణ్మోహన్‌ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి 4 వ విడత వై. యస్‌. ఆర్‌ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద 436 మందికి రూ.3.53 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు. వివిధ సామాజిక వర్గాల వారీగా రూ.40 వేల నుండి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఇందులో భాగంగా జిల్లాలో 188 మంది ఎస్‌. సి లకు రూ.1.89 కోట్లు, 20 మంది ఎస్‌. టి రూ.20.40 లక్షలు, 180 మంది బి. సి లకు రూ.95.50 లక్షలు,45 మంది ముస్లిం మరియు ఇతర మైనారిటీ లకు రూ.45 లక్షలు,బి ఓ సి డబ్ల్యూ డబ్ల్యూ బి కింద ఒకరికి రూ.40 వేలు, విభిన్న ప్రతిభావంతులకు చెందిన ఇద్దరికి రూ.3 లక్షలు మొత్తం 436 మందికి రూ.3.53 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు.ప్రభుత్వం సూచించిన వివాహ వయసు పరిమితి దాటిన వారికి మరియు 10 వ తరగతి పూర్తి చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ డి ఎ పీడీ తులసి, జిల్లా సాంఘీక శాఖ అధికారిణి రాజ్యలక్ష్మి, ఈడీ బీసీ కార్పొరేషన్‌ శ్రీదేవి,కార్పొరేటర్‌ హరిణి రెడ్డి,ప్రజా ప్రతినిధులు, సంబంధింత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️