మార్కాపురంలో టిడిపి ప్రచారం

Nov 29,2023 12:43 #Prakasam District

ప్రజాశక్తి-మార్కాపురం : పట్టణంలోని 17వ వార్డ్ లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో “బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ, 17వ వార్డ్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️