టిడిఆర్‌ హబ్‌ రద్దు చేయాలి

Jun 19,2024 23:28 #AU, #nirasana
AU, Nirasana

 ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమంగా పిహెచ్‌డి ప్రవేశాలకు డిపార్ట్‌మెంట్‌కు నిమిత్తం లేకుండా అక్రమంగా పరీక్షల నిర్వహణ, పేపర్‌ సెట్టింగ్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన టిడిఆర్‌ హబ్‌ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ సమితి నాయకులు సురేష్‌ మీనన్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రిజిస్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సురేష్‌ మీనన్‌ మాట్లాడుతూ, యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఉందని, దాని ఆధ్వర్యంలోనే పరీక్షలు జరగాలని అన్నారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పరీక్ష పత్రం సెట్టింగ్‌, నిర్వహణ జరాగాలని, ఈ నిబంధనలు పట్టించుకోకుండా టిడిఆర్‌ చైర్మన్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ అక్రమాలకు నిలయంగా తీర్చిదిద్దారని ఆరోపించారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అనేక కోర్సుల నిర్వహణ బాధ్యతలను స్టడీ సెంటర్‌ పేరిట ప్రయివేట్‌ కాలేజీలకు అప్పగించడం వల్ల, డిస్టెన్స్‌ మోడ్‌లో ఆదాయానికి గండిపడిందని తెలిపారు. డిస్టెన్స్‌ మోడ్‌లో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

➡️