అంగన్వాడీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Jun 26,2024 22:58

సమావేశంలో మాట్లాడుతున్న టి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – గురజాల :
అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిఐటియు పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్థానిక శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఫంక్షన్‌ హాల్లో బుధవారం జరిగిన అంగన్వాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటం సందర్భంగా గత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా అంగన్వాడీలు పట్టుదలతో వ్యవహరించారని, దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చి జులై నుండి అమలుకు అంగీకరించిందని చెప్పారు. ఈ అంశాలను తాజా ప్రభుత్వం పరిశీలించి వెంటనే అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని, గ్రాడ్యుటీ చేయాలని, కనీస వేతనాల పెంపులో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలని కోరారు. ఈ అంశాలపై జులై 10వ తేదీ అంగనవాడి కోర్కెల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలు తమ వాణిని ప్రభుత్వాలకు వినిపించాలని పిలుపునిచ్చారు.

➡️