ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి : విమలక్క

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ప్రత్యేక హోదాతోనే రాష్టా భివద్ధి సాధ్యమని అరుణోదయ సాంస్కతిక సంఘం గౌరవాధ్యక్షురాలు విమలక్క తెలిపారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించాలని, ప్రజా ఎజెండాను చాటుతూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం ఉప్పుగుండూరు చేరింది. తొలుత గ్రంథాలయం సెంటర్‌లో ఉన్న మాజీ సర్పంచి కామ్రేడ్‌ మాదాసు కష్ణమూర్తి విగ్రహానికి విమలక్క, కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కరీం, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్ణాకుల వీరాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ 21 రోజుల పాటు జనచైతన్య యాత్ర సాగుతుందన్నారు. కండలేరు ముంపు గ్రామాలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గామాలు, దళితుల హత్యాకాండ జరిగిన కారంచేడు ,చుండూరు సందర్శనతో పాటు విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఈ యాత్ర సాగుతుందన్నారు ప్రజావ్యతిరేక విధానాలను ఆవలంబిస్తున్న బిజెపికి రాష్ట్రంలో టిడిపి, జనసేన, వైసిపి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా విమలక్క బృందం ప్రజా సమస్యలపై ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు గంగా భవాని, భాస్కర్‌, రమేష్‌, పెంచలన్న, అరుణోదయ రాష్ట్ర నాయకులు మల్సుర్‌, డక్కలి కష్ణా, సుధాకర్‌, రమేష్‌, లింగన్న, రామన్న, అరుంధతి, రాజి తదితరులు పాల్గొన్నారు.

➡️