సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. ఆదివారం సాయి శ్రీనివాస గార్డెన్స్‌లో ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో బాధ్యతగా మెలిగిన మనపై కొంతమంది విషప్ర చారం చేస్తూ అసలు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్తే అవసరం లేదన ట్లుగా ప్రజల నుంచి ఉద్యోగులను దూరం చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆత్మగౌరవం, హక్కుల కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘భజనతో కాదు-బాధ్యతతో, పార్టీలతో కాదు-ప్రభుత్వంతో’ అనే నినాదంతో ఐక్యవేదిక పని చేస్తుందని తెలిపారు. బలోపేతానికి ఉద్యో, ఉపాధ్యా, కార్మిక, పెన్షనర్లు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. 12వ పిఆర్‌సి వెంటనే అమలు చేసి సకాలంలో డిఎ చెల్లించాలని పేర్కొన్నారు. రూ.25 వేల కోట్లుకు పైగా ఉన్న పెండింగ్‌ పిఆర్‌సి, డిఎ, ఎస్‌ఎల్‌ఎస్‌, ఎపిజిఎల్‌ఐ బకాయిలు చెల్లించాలని తెలిపారు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎంఆర్‌ కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ చేయాలని పేర్కొన్నారు. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ అమలు చేయాలని చెప్పారు. మెరుగైన హెల్త్‌ స్కిం అమలు చేయాలని తెలిపారు. ఇళ్లస్థలాలు కేటాయిం చాలని డిమాండ్‌ చేశారు. టీచర్స్‌ యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ సమస్యకి శాశ్వత పరిష్కారం-మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, సర్వీస్‌ రూల్‌ అమలు, సంస్థాగత సమస్యలకు పరిష్కారం చూడాలని తెలిపారు. ఎపిఎస్‌ ఆర్‌టిసి ఉద్యోగుల విలీన సమస్యలు పరిష్క రించాలని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కా రానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమా చారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒకటవ తేదీ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు చెల్లించకపోయినా ఆహా, ఓహో అని ఎప్పుడైతే బజన చేసే పరిస్థితికి ఉద్యోగ సంఘాలు దిగజారిపోయాయో వేలాదిగా పెరుకుపోయిన బకాయిలు ఎలా చెల్లిస్తుంది అడి అడిగే పరిస్థితిలో నాయకులు లేరని విమర్శించారు. ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ బాజి, జిల్లా అధ్యక్షులు ఎం.రమేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి జె.సుదర్శన్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️