నీలిచుక్కల పండుగ

May 13,2024 05:40 #aksharam

ఓట్ల కోసం
నేతల గాయి గాయి గారడీలు ఆగినై
ఊకదంపుడు ఉపన్యాసాలు ఆగినై
మొసవర్రని మైకుల మొత్తుకోళ్లలో మునిగి
ఏమీ పాలుపోని జనులు ఇప్పుడిప్పుడే
లోలోన ఆలోచించుకుంటున్నరు
సూపుడేల్ల దడిగట్టి ప్రజాస్వామ్య దీపాన్ని
నీతిమాలిన నేతల సుడిగాళ్ళ నుంచి కాపాడుకోవాలని …

ఏ రాతిరి బస్సుకో, ఏ పొద్దుటి రైలు బండికో
ఆటోనో, బైకో ఎదుంటే అది అందుకుని
ఓటేయ్యనికి ఊరోళ్ళందరు ఏడున్నా
దసరా పండుక్కి
తల్లిగారింటికొచ్చినంత సంబురంగా వద్దురు
ఓటేసినంకా సూపుడు వేలు సూపిస్తూ
బహు మురిసిపోదురు
ఈ సూపుడేలి మీది నీలి సుక్కే
రేపటి వారి బతుకు దారి సూపే మూలసుక్కని ..!
– దిలీప్‌.వి, 84640 30808

➡️