పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమే : ఎస్‌పి

ప్రజాశక్తి-తిరుమల : పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమేనని ఎస్‌పి కే.శ్రీనివాస్‌ తెలిపారు. వెంకటగిరి -ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్‌ పోస్ట్‌ వద్ద ఘటన జరిగిందన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్‌ఐ వినోద్‌ కుమార్‌ బృందం తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ కారు అతివేగంగా చెక్‌ పోస్ట్‌ను, కానిస్టేబుల్‌ ఢకొీనడంతో తలకు గాయమైందన్నారు. రేణిగుంట సమీపంలో ఉన్న అమర్‌ రాజా హాస్పిటల్‌లో కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ తలకు శస్త్ర చికిత్స జరిగిందని తెలిపారు. టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏర్పేడు సీఐ శ్రీరాం శ్రీనివాస్‌ విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు.

➡️