చలో విజయవాడకు తరలిన హామాలి కార్మికులు

ప్రజాశక్తి – సామర్లకోట (కాకినాడ) : ఏపీ బేవరేజ్‌ హమాలీ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెరిగిన రేట్లకనుగుణంగా దిగుమతి కూలి రేట్లు పెంచాలని … పిఎఫ్‌, ఈఎస్‌ఐ, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … మంగళవారం చేపట్టిన చలో విజయవాడ ఆందోళనకు సామర్లకోట ఐఎంఎల్‌ డిపో నుండి హామాలీ కార్మికులు తరలి వెళ్లారు. సామర్లకోట, అమలాపురం డిపోలకు చెందిన హామాలి కార్మికులు ఈరోజు ఉదయం పాస్‌ పాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ లో విజయవాడకు తరలి వెళ్లారు. విజయవాడ ఎండి కార్యాలయం వద్ద హమాలీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా ఆందోళన చేపట్టారు. సామర్లకోట నుండి తరలి వెళ్లిన వారిలో డిపో యూనియన్‌ నాయకులు బి.ఆదినారాయణ, వి.గోవిందు, యు.సతీష్‌, కె.దుర్గాప్రసాద్‌, ఎం.వీరబాబు, బి.రామారావు, తదితర కార్మికులు ఉన్నారు.

➡️