మున్సిపల్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జోక్యంతోనే పరిష్కారం

  • సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల జోక్యం వద్దు
  • చెవిలో పువ్వులతో నిరసన
  • సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటేనే పరిష్కారం అవుతాయని సలహాదారులు రాజ్యాంగ ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండరాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న నిర్వాదిక సమ్మెకు ఆయన హాజరైనారు కార్మికులు చెవులో పూలు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ.. కానీ ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించేవారు కార్మికులేనని అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం చేష్టలుడికి చోద్యం చూస్తోందన్నారు. కోవిటి సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించింది కార్మికులే నన్న విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది నిమిషాలలో పరిష్కరించవచ్చునన్నారు. అయితే కార్మికులు డిమాండ్ చేసి హక్కులు సాధించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదన్నారు. వారి చెప్పిన దానికి డుడు బసవన్నల తాలూకు ఉండాలి వారు భిక్ష వేస్తే తీసుకొని జి హుజూర్ అనాలని ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.  ప్రభుత్వం లోకి వైకాపా పార్టీ వచ్చిన వెంటనే వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ఇచ్చి ఐదేళ్లు పదవీకాలం పూర్తి కావస్తున్న ఇప్పటికీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు కార్మికులు నిరవధిక సమ్మె నోటీసు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం సమ్మె వద్దని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిశీలిస్తామని చెప్పటం దారుణం అన్నారు. ఐదేళ్ల కాలంలో పరిష్కరించలేని కార్మిక సమస్యలు నాలుగు నెలల్లో వెళ్ళిపోయే ప్రభుత్వానికి ఇంకా గడువు కావాలని కోరడం సరికాదన్నారు. వీళ్ళ తరబడి చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో కార్మికులు విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఆప్కాస్ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి కార్మికులకు తీసుకువచ్చిందన్నారు ఆప్కాస్ లో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ వితంతువులకు ఇచ్చే పెన్షన్లను నిలిపివేశారన్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాల్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ కటింగ్ పోను చేతికి 8,000 అందితోందని అందుతోందని అన్నారు వేడినీళ్లకు చన్నీళ్లుగా వచ్చిన పింఛన్లను నిలిపివేయడం ద్వారా జగన్ తమ బ్రతుకులను దుర్భరం చేశారని కార్మికులు వాపోతున్నారన్నారు. అమ్మఒడి విద్యా దీవెన తదితర సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొంటూ కోత విధించారు అన్నారు. దీనివలన పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. సమాన పనికి సమాన వేతనం కార్మికులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరటం న్యాయమైనదన్నారు. ఈ డిమాండ్ల సాధనకై గడచిన ఐదేళ్ల కాలంలో వివిధ రూపాలలో ఆందోళనలు పీకేటింగులు సమ్మెలు చలో విజయవాడ వంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టిన పాపాన పోలేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన నిరవధిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అలాగే అంగన్వాడీలు సైతం 16 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయాలని చూస్తుంది కానీ వారి డిమాండ్ పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదన్నారు. కార్మిక లోకం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి సమీప ఎన్నికలలో తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు నగర కార్యదర్శి ఆర్ వి నాయుడు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు నగర కమిటీ తిరుమలేశు ఎర్రి స్వామి సంజీవ రాయుడు మల్లికార్జున వరలక్ష్మి పోతులయ్య ఓబుల పతి నల్లప్ప ఐఎఫ్టియు అధ్యక్షులు యేసు రత్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ నాయకులు లతా హరి తదితరులు ర్యాలీగా వచ్చి శిబిరంలో ఉన్న వారికి మద్దతు ప్రకటించారు శిబిరంలోనే కార్మికులు తమ ఇళ్ల నుంచి తెచ్చుకున్న భోజన క్యారియర్లలో భోజనం చేశారు. రహదారి వెంబడి కూర్చుని కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు.

➡️