ఆకలితో సిబ్బంది నకనక

May 13,2024 00:01

పంపిణీ కేంద్రం వద్ద భోజనం అయిపోవడంతో అసహనంగా ప్రశ్నిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో డిస్టిబ్యూ షన్‌ కేంద్రాల వద్ద సదుపాయాల లేమి కనిపించింది. ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు మియామక పత్రాలను అందుకొని వెళ్లాల్సిన 1691 మంది సిబ్బంది సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద అవస్థ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసేందు కు సిబ్బంది మొత్తం వరుస కట్టారు. చివరకు వచ్చే సరికి 200 మందికి పైగా ఆహారం సరిపోలేదు. దీంతో పలువురు సమీపంలోని హోటళ్లకు వెళ్లి తమ సొంత డబ్బులతో భోజనం చేశారు. తాత్కాలికంగానైనా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బందంతా అసౌకర్యానికి గురయ్యారు.

➡️