డిమాండ్ల పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదు

Dec 21,2023 15:13 #Anganwadi strike
  • పీలేరులో అంగన్వాడిల మానవహారం

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య): అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదని సిఐటియు, ఏఐటియుసి నాయకులు తెలిపారు. అంగన్వాడీల 10వ రోజు సమ్మెలో భాగంగా గురువారం పీలేరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మానవహారం గా ఏర్పడి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దనాసి వెంకటరామయ్య, ఏఐటీయూసీ నాయకులు టియల్ వెంకటేష్, నరసింహులు, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సరళమ్మ, రెడ్డమ్మ, శారద, ప్రేమ, ఎల్లమ్మ, రూప, సుహాసిని, శోభ తదితరులు పాల్గొన్నారు.

➡️