మినీ లారీని ఢకొీన్న వ్యాను..

– మహిళ మృతి –

ఇద్దరికి గాయాలు

ప్రజాశక్తి- కనిగిరి మినీ లారీ, వ్యాను ఢకొీన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కనిగిరి పట్టణంలోని డిగ్రీ కాలేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. అందిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి (45). సుశీల, జయలక్ష్మి మరి కొందరు కూలీలు కలిసి ఇంటి స్లాబ్‌ పనుల నిమ్తితం సామగ్రి తీసుకొని లారీలో వస్తున్నారు. అదే సమయంలో కనిగిరి నుంచి పామూరు వైపు వెళ్తురన్న వ్యాన్‌ ఢకొీంది. దీంతో వెనుక చక్రాలు ఊడి పోవడంతో లారీ బోల్తాకొట్టింది. దీంతో ఉప్పు రమాదేవి. సుశీల, జయలక్ష్మి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ఉప్పు రమాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు హాస్టిటల్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే పొదిలి వద్ద మృతిచెందిందతి. మృతురాలికి భర్త, ఇద్దరు ఆడపిల్లలు,. ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. కనిగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️