ఇటీవల దుకాణాల్లో.. ఇప్పుడు జెసిబిలలో చోరీలు

Nov 29,2023 11:28 #Chittoor District
theft in pachhikapulam

పచ్చికాపల్లంలో పట్టించుకునే వారు లేరా
పోలీసుల వైపల్యమా స్థానికుల నిర్లక్ష్యమా
రాత్రి జెసిబి లలో బ్యాటరీల చోరి
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని పచ్చి కాపల్లంలో జేసీబీ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. మొత్తం 9 జేసీబీలలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో శ్రీ వరసిద్ధి వినాయక ఎర్త్ మూవర్స్ కి చెంసిన రెండు జేసీబీల బ్యాటరీలు చోరీకి గురయ్యింది. మంగళవారం రాత్రి ఘటన జరిగినట్లు బాధితులు తెలియజేసారు. వరుస చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు నియంత్రణా చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానికులు కోరుతున్నారు.

➡️