వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : నిన్నటి వరకూ అంటి అంటనట్టుగా ఉన్న టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు, టిడిపి సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నె రవీంద్ర ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి యర్రగొండ పాలెంలో టిడిపి జెండా ఎగుర వేసేందుకు సమాయత్తమయ్యారు. కలిసి వచ్చే వారిని అక్కున చేర్చుకుంటున్నారు. యర్రగొండ పాలెం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాయకులు టిడిపిలో చేరుతున్నారు. రాజకీయాల్లో చేరినప్పటి నుండి వైసీపీలోనే కొనసాగుతున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపి వీడి టిడిపిలో చేరుతున్నారంటే యర్రగొండపాలెంలో టిడిపి పరిస్థితి గతం కంటే మెరుగు పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గం లోని సామాజిక స్థితిగతులు అర్థం చేసుకుని అభివద్ధి గురించి మాట్లాడటం ఎరిక్షన్‌ బాబుకు కలిసి వచ్చే అంశంగా మారింది. చైతన్య రథంపై ప్రచారంటిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ యర్రగొండపాలెం నియోజక అభ్యర్థి గూడూరి ఎనిక్షన్‌బాబు, టిడిపి సీనియర్‌ నాయకులు మన్నె రవీంద్ర తెలిపారు. టిడిపి చైతన్య రథాన్ని శుక్రవారం ప్రారంభించారు, అనంతరం చైతన్య రథంపై ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ మన్నె రవీంద్ర, ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరి ఎరిక్షనబాబు కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా, కుమారుడు గూడూరి అజిత్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్థి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్‌, వలరాజ, శ్రీనివాసరెడ్డి, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, మంత్రూ నాయక్‌, వేగినాటి శ్రీనివాస్‌, కామేపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు వెంకట కోటయ్య, బివి. సుబ్బరెడ్డి, షేక్‌ మాబు, సుబ్బరత్నం, కె.భాస్కర్‌, బోడా చెననయ్య, షేక్‌ మస్తాన్‌వలి, షేక్‌ వలి, వెంకట్రావు గూడ్‌, కిశోర్‌, రమణమ్మ పాల్గొన్నారు.

➡️