జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలి

May 11,2024 20:55

ప్రజాశక్తి – కొమరాడ: గ్రామాల్లో ఫీవర్‌ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు స్పష్టం చేశారు. సివినిలో శనివారం సందర్శించిన ఆయన వైద్య సిబ్బంది అక్కడ చేపడుతున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. ఫీవర్‌ సర్వలెన్స్‌, డ్రైడే కార్యక్రమాల నిర్వహణ, వాటి నమోదు వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. సర్వేలో సేకరించిన రక్త పూతల స్లైడ్స్‌ను ల్యాబ్‌లో త్వరగా పరీక్షలు జరిపి నివేదికలు తెలపాలన్నారు. అలాగే సికిల్‌సెల్‌ ఎనీ మియా నిర్దారణ పరీక్షలను పరిశీలించారు. గ్రామ ంలో ఫ్రైడే డ్రైడే ఏ మేరకు నిర్వహిస్తున్నారో గమని ంచారు. దోమల లార్వా గుర్తించడంలో దృష్టి సారించాలన్నారు. గర్భిణీ గృహ సందర్శన చేసి ఆరోగ్య పరిశీలన చేశారు. డీహైడ్రేషన్‌ చెంద కుండా జాగ్రత్తలు సూచించారు. అవసరమైన మం దులు, నిర్దారణ పరీక్షలు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు గ్రామంలో అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బం దికి సూచించారు. కార్యక్రమంలో పిహెచ్‌ఎన్‌ విజయకుమారి, వైద్య సిబ్బంది ప్రమీల, లత, రామ కృష్ణ, రమేష్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️