అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు సక్సెస్‌

అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు సక్సెస్‌

అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు సక్సెస్‌ప్రజాశక్తి – శ్రీకాళహస్తి అందరి సహకారంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ధూర్జటి కళాప్రాంగణంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల విజయవంతంలో భాగస్వాములైన అధికారులను, సిబ్బందిని, పాత్రికేయులను, స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఆలయం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ సిబ్బంది నిద్రాహారాలు మాని ఉత్సవాల విజయవంతానికి కషి చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి సహకారంతో ఉత్సవాలను దిగ్విజయంగా ముందుకు సాగించినట్లు వివరించారు. ఆర్డీవో రవి శంకర్‌ రెడ్డి, డీఎస్పీ ఉమా మహేశ్వరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, సీఐలు నరసింహా రావు, రారాజు పాల్గొన్నారు.

➡️