ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులు

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులు

ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంతహశీల్దారు కార్యాలయంను ముట్టడించిన వరద బాధితులుప్రజాశక్తి -వాకాడు: ఇటీవల మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైదని, వెంటనే తమను ఆదుకోవాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట వాకాడు దుగ్గరాజుపట్నం పంచాయతీ ప్రజలు బైఠాయించారు. విధుల నిర్వహణకు కార్యాలయానికి వచ్చిన ఎంపీడీవో తోట గోపీనాథ్‌ను, తహశీల్దారు నరసింహా మూర్తిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా బాధితులు అడ్డుకుని తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. చివరకు రెండు మూడు గంటల తర్వాత ఆర్డీవో కిరణ్‌ కుమార్‌ బాధితులను వారించడంతో వారు వెనుతిరిగినట్లు సమాచారం.

➡️