ఇంటి స్థలాలు చూపకుంటే…ఎంఎల్‌ఎ బియ్యపు ఇంటికి పేదల పాదయాత్ర

ఇంటి స్థలాలు చూపకుంటే...ఎంఎల్‌ఎ బియ్యపు ఇంటికి పేదల పాదయాత్ర

ఇంటి స్థలాలు చూపకుంటే…ఎంఎల్‌ఎ బియ్యపు ఇంటికి పేదల పాదయాత్రపజాశక్తి – రేణిగుంట ‘ఇంటి స్థలాలు చూపకుంటే ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఇంటికి రేణిగుంట మండలం కరకంబాడి ఎర్రగట్ట నుంచి రెండువేల మందితో పాదయాత్ర చేపడతాం’ అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, మండల నాయకులు కె.హరినాథ్‌ అన్నారు. మంగళవారం ఇంటి స్థలాల పోరాట కమిటి ఆధ్వర్యంలో కరకంబాడి పంచాయతీలోని ఎర్రగుట్టపైన గుడిసెలు వేసుకున్న పేదలతో మంగళవారం బహిరంగసభ నిర్వహించరు. ఈ సందర్భంగా అంగేరి పుల్లయ్య, కె.హరినాథ్‌ పేదల పోరాటానికి సంఘీభావం తెలిపారు. జనవరి 26 నుంచి ఈ గుట్టపైనే నాలుగువేల మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారని, అర్హత ఉన్నా ఇంటి స్థలం రాలేదన్నారు. శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి న్యాయం చేసేంత వరకూ ఈ కరకంబాడి ఎర్రగుట్ట దిగేది లేదన్నారు. బుధవారం ఉదయం శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎ ఇంటి వద్దకు వెళ్లి ఇంటి స్థలాల పోరాట కమిటి, సిపిఎం జిల్లా నాయకులు కలవబోతున్నామన్నారు. పేదలకు న్యాయం జరగని పక్షంలో రేణిగుంట నుంచి ఎంఎల్‌ఎ ఇంటి వరకూ రెండువేల మంది పేదలతో పాదయత్ర చేస్తామన్నారు. రేణిగుంట మండల పరిధిలోనే ఇంటి స్థలాలు చూపించేంత వరకూ ఎంఎల్‌ఎ ఇంటి వద్దనే కూర్చుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలాల పోరాట కమిటీ అధ్యక్షులు రాజశేఖర్‌, కార్యదర్శి సత్యశ్రీ, శివనందం, సెల్వరాజ్‌ పాల్గొన్నారు.

➡️