ఒక్క ఛాన్స్‌ చివరి ఛాన్స్‌ కావాలిభూములు దోచేందుకే ల్యాండ్‌ టైటిల్‌చట్టంరైతుల పంటలకు ఎయిర్‌పోర్టు పూర్తిచేస్తాంఅంగన్‌వాడీల సమస్యలు న్యాయమైనవికుప్పంలో లక్ష మెజార్టీ వస్తే 175 మనవేశాంతిపురం, రామకుప్పం సభల్లో చంద్రబాబు

ఒక్క ఛాన్స్‌ చివరి ఛాన్స్‌ కావాలిభూములు దోచేందుకే ల్యాండ్‌ టైటిల్‌చట్టంరైతుల పంటలకు ఎయిర్‌పోర్టు పూర్తిచేస్తాంఅంగన్‌వాడీల సమస్యలు న్యాయమైనవికుప్పంలో లక్ష మెజార్టీ వస్తే 175 మనవేశాంతిపురం, రామకుప్పం సభల్లో చంద్రబాబు

ఒక్క ఛాన్స్‌ చివరి ఛాన్స్‌ కావాలిభూములు దోచేందుకే ల్యాండ్‌ టైటిల్‌చట్టంరైతుల పంటలకు ఎయిర్‌పోర్టు పూర్తిచేస్తాంఅంగన్‌వాడీల సమస్యలు న్యాయమైనవికుప్పంలో లక్ష మెజార్టీ వస్తే 175 మనవేశాంతిపురం, రామకుప్పం సభల్లో చంద్రబాబుప్రజాశక్తి – శాంతిపురం, రామకుప్పం జగన్‌ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని టిడిపి అదినేత నారా చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు జగన్‌ అడిగిన ఒక్క ఛాన్స్‌ చివరి ఛాన్స్‌ కావాలన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం శాంతిపురం, రామకుప్పంలలో రోడ్డుషో సభలు జరిగాయి. శాంతిపురంలో అంగన్‌వాడీ శిబిరం వద్దకు నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డుషో సభల్లో ‘స్థానికత’ను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. కుప్పంలో లక్ష మెజార్టీ వస్తే 175 స్థానాలు మనవేనని అన్నారు. ‘శాంతిపురం నాకు కొత్త కాదు.. ఎపుడూ వస్తూనే ఉంటాను. కానీ మీలో ఈసారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోంది.. మిమ్మల్నిచూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది.. నిన్న, నేడు మీ ఉత్సాహం చూశాక మన కుప్పంలో టిడిపికి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపిస్తోంది. ఎపుడు ఎన్నికలు జరిగినా టిడిపి జెండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి. ఒకటి కుప్పం, రెండోది హిందూపురం. హిందూపురం ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. రెండోది మీ అభిమానంతో నేను గెలిచే కుప్పం నియోజకవర్గం’ అని శ్రేణులను ఉత్సాహపరిచారు. వైసిపి హయాంలో 13 శాతం పనులు పూర్తి చేసి హంద్రీనీవా నీటిని కుప్పంకు తీసుకురాలేకపోయారన్నారు. కుప్పంలో పట్టు పరిశ్రమ తీసుకురావడమే తన లక్ష్యమని, ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేసి రైతుల ఉత్పత్తులు ప్రపంచ నలుమూలలకు ఎగుమతులు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇసుక, మైనింగ్‌ ఏది వీళ్ల కళ్లల్లో పడినా మటాష్‌ అన్నారు. ఐదేళ్లుగా కుప్పంలో రౌడీయిజం, కబ్జాలు పెరిగాయన్నారు. పెద్దిరెడ్డి వేల కోట్లు దోచుకున్నారని, ఆయన ఇంట్లో మంత్రి, ఎంఎల్‌ఎ, ఎంపి ఉన్నారన్నారు. సాక్షి విలేకరి ఎచ్చర్లలో ఎంఎల్‌ఎ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎ పిఎ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వైసిపి వాళ్లను తాను సిఎం అయ్యాక వదిలిపెట్టనన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోడానికి ఇంటికొకరు తయారవ్వాలి.. భయపడితే భవిష్యత్‌ ఉండదని అన్నారు. టిడిపిలో చేరికలుకుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ నందు నియోజకవర్గ ప్రజల అర్జీలు స్వీకరించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ నూరు రోజుల తర్వాత న్యాయం జరుగుతుందని… నూరు రోజుల తర్వాత … మన ప్రభుత్వం వస్తుందని తప్పక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ దళిత నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి దళిత సోదరులకు ప్రభుత్వం వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని విషయాలను వారికి క్షుణ్ణంగా వివరించారు. వైసిపి అసంతృప్తి నాయకులను 210 మందిని టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్‌, కన్నన్‌, విజరుకుమార్‌ పాల్గొన్నారు. శాంతిపురం లక్ష్మీ థియేటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 మంది టిడిపిలో చేరారు.

➡️