కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబు

కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబుప్రజాశక్తి -రామచంద్రాపురం ( చంద్రగిరి): ప్రతి విద్యార్థి కృషి పట్టుదల, దీక్షను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చని మోహన్‌ బాబు విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ మోహన్‌ బాబు అన్నారు. శుక్రవారం మోహన్‌ బాబు విశ్వవిద్యాలయంలో బీటెక్‌, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డిప్లమా, అగ్రికల్చర్‌, పారామెడికల్‌ కోర్సులలో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులను గురువులుగా భావించి లక్ష్యసాధనకు కషి చేయాలని విద్యార్థులకు హితబోధ చేశారు. కన్న తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని ఉద్దేశంతో చదివినప్పుడే మంచి భవిష్యత్తుకు చేరుకోగలరని అన్నారు. విద్యార్థులు ఈ వయసులో క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునే సందేశం ఇచ్చారు. విద్యార్థి దసే జీవితానికి మంచి మలుపు లాంటిదని, దుర అలవాట్లకు లోను కాకుండా మంచి జీవితాన్ని పొందేందుకు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్టర్‌ ఆచార్య సారధి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

➡️