కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమ, మంగళవారాల్లో సంక్రాంతి, కనుమ పండుగ రోజున కూడా సమ్మెను కొనసాగించారు. మంగళవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ముగ్గులు వేసి కొత్తకుండ తెచ్చి పొంగలి పెట్టారు. అలాగే కనుమ పండుగ రోజున దీక్ష శిబిరం ముందు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు టి.నాగరాజమ్మ మాట్లాడుతూ 35రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్క, చెల్లెమ్మలు వీధుల్లోకి పోరాడుతున్నా, పండగల సమయంలో కూడా శిబిరాల్లోనే ఉంటున్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీలు కల్పన, గీత, ఎల్లమ్మ, సుజాత, సుజిత, వరలక్ష్మి, గంగాదేవి పాల్గొన్నారు.రేణిగుంట: మంచినీళ్ళ గుంట పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద జరుగుతున్న అంగన్వాడీ సమ్మె 36వ రోజుకు చేరుకున్న సందర్భంగా కనుమ పండుగ మంగళవారం రోజు శిబిరం వద్ద అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు శవాసనం వేసి నిరసన తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రేణిగుంట ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షకార్యదర్శులు ధనమ్మ, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, పార్వతి, రేవతి, ఐఎఫ్‌టియు నాయకులు రాధమ్మ, విజయలక్ష్మి పాల్గొనగా సిఐటియు నాయకులు వెంకటరమణ, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సెల్వరాజ్‌ సమ్మెకు మద్దతు తెలిపారు.పిచ్చాటూరు: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని సీపీఎం సత్యవేడు నియోజక వర్గఇన్ఛార్జ్‌ దాసరి జనార్దన్‌ హెచ్చరించారు. 36రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వానికి సంక్రాంతి పండుగ సంబరాలకు కోట్లు రూపాయలను ఖర్చు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పండగలు ఇండ్ల వద్ద జరుపుకోవాల్సిన అంగన్వాడీలు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును తూర్పారబడుతూ వారి అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నారని తెలిపారు. అనంతరం అంగన్వాడీలకు ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగలాపురం నాగరాజు, రామచంద్రారెడ్డి, మురుగేష్‌, మురుగన్‌ అంగన్వాడీలు పాల్గొన్నారు.వెంకటగిరి: అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డీపల్లి చెంగయ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు అధ్యక్షులు ఏ మంజుల వెంకటగిరి మండల అధ్యక్షులు సుభాషిని మాట్లాడుతూ ఇప్పుడు అంగన్వాడీలను కన్నీరు పెట్టిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా గద్దె దిగిపోవడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని లేదంటే రోజురోజుకీ సమ్మె ఉధృతం అవుతుందని, జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. గూడూరు టౌన్‌: అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె 36వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ అంగన్వాడీలు గత 36రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. యూనియన్‌ అధ్యక్షురాలు ఇంద్రావతి, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, సీఐటియునాయకులు బివి.రమణయ్య, సురేష్‌ పాల్గొన్నారు.

➡️