టాటా మోటార్స్‌ కొత్త వాహనాలు ఆవిష్కరణ

Dec 5,2023 21:32
టాటా మోటార్స్‌ కొత్త వాహనాలు ఆవిష్కరణ

ప్రజాశక్తి-తిరుపతి సిటి: దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సరికొత్త ఇంట్రా వి70 పికప్‌, ఇంట్రా వి20 గోల్డ్‌ పీకప్‌, ఎస్‌ హెచ్‌టి ప్లస్‌ వాహనాలను ఆవిష్కరించినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఫ్‌ు తెలిపారు. కొత్త వాహనాల ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త వాహనాలు మెరుగైన ఆదాలతో ఎక్కువ దూరాలను, ఎక్కువ పేలోడ్‌లను మోసుకెళ్లాలా రూపొందించామన్నారు. అత్యుత్తమ క్లాస్‌ ఫీచర్‌లను అందించడంతో పాటు వివిధ రకాల వినియోగాల కోసం రూపొందించబడ్డాయన్నారు. ఇంట్రా వి70 హాయ్యోస్ట్‌ రేటెడ్‌ పేలోడ్‌ 1700 కిలోలు, 220 ఎన్‌ఎం టార్క్‌తో 1.5లీటర్ల డీజల్‌ ఇంజన్‌తో శక్తివంతమైనదిగా, 2960 మిల్లీమీటర్ల పొడవైన లోడ్‌బాడీతో రూపొదించామన్నారు. దీని క్యాబిన్‌ కారులాంటి సౌకర్యాన్ని, అలసట లేని డ్రైవింగ్‌ అనుభూతిని అందించేలా రూపొందించామన్నారు. ఇంట్రా వి20 గోల్డ్‌్‌ 800 కెఎంల గరిష్ట రేంజ్‌, 1200 కిలోల హాయ్యోస్ట్‌ రేటెడ్‌ పేలోడ్‌ సామర్ధ్యం, 2690మిల్లీమీటర్ల పొడవుతో క్లాస్‌ లీడింగ్‌ లోడ్‌ బాడీతో రూపొందింది. టాటా ఎస్‌ హెచ్‌టి ప్లస్‌ 800 సిసి డీజల్‌ ఇంజన్‌, అతి పొడవైన డెక్‌, 900 కిలోల హైపేలోడ్‌ సామర్ధ్యంతో రూపొదించిందబడిందని తెలిపారు. వీటిని దేశ వ్యాప్తంగా అన్ని డీలర్ల్‌ వద్ద అందుబాటులో ఉంచామని, ఆశక్తిగల వారు వెంటనే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. నాణ్యతకు, మన్నికకు మరోపేరుగా టాటా మోటర్స్‌ నిలుస్తుందని తెలిపారు. ఈ అవకావాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️