తలకోన జలపాతం ఉగ్రరూపం

తలకోన జలపాతం ఉగ్రరూపం

తలకోన జలపాతం ఉగ్రరూపంప్రజాశక్తి – యర్రావారిపాలెంతలకోన అటవీ ప్రాంతంలో గల జలపాతం గత మూడు రోజులుగా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జలపాతం దగ్గరికి వెళ్లడానికి పర్యాటకులకు ఎవరికి అనుమతి లేకుండా నీతి ఉధతి తగ్గేంతవరకు ఆలయ ప్రాంగణంలో గల చెక్‌ పోస్టును ఎస్సై ఈశ్వరయ్య తన సిబ్బందితో కలిసి మూసివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు ఆలయం వరకే అనుమతి ఇచ్చారు.

➡️