తిరుచానూరు రోడ్డుకు మహర్దశ

Dec 21,2023 22:21
తిరుచానూరు రోడ్డుకు మహర్దశ

ప్రజాశక్తి-తిరుపతి సిటి: దశాబ్ధాల కల నిజం కాబోతోంది. తిరుచానూరు 150 బైపాస్‌ నుంచి ఉప్పరపల్లి నారాయణాద్రి హాస్పిటల్‌ వరకు ఉన్న రోడ్డుకు మహార్ధశ పట్టింది. ఎట్టికేలకు తిరుపతి డిప్యూటీ మేయరు, యువ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి చొరవతో, టిటిడి చైర్మన్‌, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి సహాకారంతో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా తిరుచానూరు రైల్వేస్టేషన్‌ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు నిత్యం గుంతలమయంగా ఉండేది. పందుల సంచారం. మురికికాల్వలు, డ్రైనేజీ నీటితో కాస్తో కూస్తో ఉన్న రోడ్డు కూడా వాహనాలకే కాదు, పాదాచారుల ప్రయాణికి సైతం ఇబ్బందికరంగా ఉండేది. మాస్టర్‌ ప్లాన్‌లో బాగంగా 2.25 కిలోమీటర్ల పొడవున 150అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి అనుమతి వచ్చింది. రూ.13.29 కోట్ల రూపాయల వ్యయంతో మద్యలో డివైడర్‌తో కూడిన 4 లేన్ల రోడ్డుకు టెండర్లు కూడా పూర్తయాయ్యి. ఇప్పటికే సర్వే పూర్తయింది. తొందర్లోనే పనులను సైతం ప్రారంబించి, అత్యంతవేగంగా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డు పూర్తయితే శెట్టిపల్లి, మంగళం, ఉప్పరపల్లి, మిట్టగాంధీపురం, తిమ్మనాయుడు పాలెం, రణదీర్‌పూరం, చెన్నరుగుంట, వెంకటాపురం, బిటిఆర్‌ కాలనీ, సప్తగిరి నగర్‌, శేషాచల కాలనీ, శివశంకర్‌ కాలనీ, కాటన్‌మిల్లు, ఆటోనగర్‌, మంగళం ఆర్‌టిసి డిపో, ఎస్టేట్‌కు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకునేందుకు, చిత్తూరు, పుత్తూరు, బెంగుళూరు, వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు తిరుపతి నగరంలో ప్రవేశించి, ట్రాపిక్‌ ఇబ్బందులు పడకుండా ఈ మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చును. దీంతో పాటు పూడి, అప్పలాయగుంట, తడుకు, రామచంద్రాపురం, తనపల్లి, కుంట్రపాకం, వెంకటరామాపురం, తిరుపతి రూరల్‌ పంచాయతీలకు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అవసరమైనది. ఎట్టికేలకు ఈ రోడ్డును 4 లేన్లగా రూపొందించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రోడ్డు పనులను త్వరతగతిన ప్రారంభించి, వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దశాబ్దాల తరబడి అబివృద్దికి నోచుకోని నారాయణాద్రి ఆసుపత్రి- తిరుచానూరు రోడ్డు పనులకు శ్రీకారం చుట్టేందుకు చొరవ చూపిన తిరుపతి డిప్యూటీ మేయరు భూమన అభినరు రెడ్డికి, టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మా ప్రాంత వాసులు ఎప్పటికి రుణపడి ఉంటాం. అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. అనేక పార్టీలు, ప్రభుత్వాలు మారీనా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఎట్టికేలకు అభినరురెడ్డి చొరవ చూపడంతో రోడ్డు పనులు ముందుకు వెల్లడం శుభపరిణామం. త్వరలోనే రోడ్లు పూర్తయి, స్తానికులు అందుబాటులోకి రానున్నాయి. మరొక్కసారి అబినరురెడ్డికి కృతజ్ఞతలు. – కె.రామకృష్ణ, ఉప సర్పంచ్‌, శెట్టిపల్లి పంచాయతీ

➡️