బై జూస్‌.. ఃవైపః యూజ్‌…!శ్రీ ఃబజాజ్‌ఃతో కలిసి కోట్లల్లో బురిడీ శ్రీ లాప్‌టాప్‌, ట్యాబ్‌లంటూ మోసం శ్రీ తిరుపతిలోనే వెయ్యిమంది బాధితులు

బై జూస్‌.. ఃవైపః యూజ్‌...!శ్రీ ఃబజాజ్‌ఃతో కలిసి కోట్లల్లో బురిడీ శ్రీ లాప్‌టాప్‌, ట్యాబ్‌లంటూ మోసం శ్రీ తిరుపతిలోనే వెయ్యిమంది బాధితులు

బై జూస్‌.. ఃవైపః యూజ్‌…!శ్రీ ఃబజాజ్‌ఃతో కలిసి కోట్లల్లో బురిడీ శ్రీ లాప్‌టాప్‌, ట్యాబ్‌లంటూ మోసం శ్రీ తిరుపతిలోనే వెయ్యిమంది బాధితులుప్రజాశక్తి – తిరుపతిఃః ప్రస్తుతం ప్రైవేటు యూజర్లకు రూ. 20 వేల నుంచి 25 వేలు చెల్లిస్తే అందిస్తున్న బైజూస్‌ కంటెంట్‌, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాం. తద్వారా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎదుగుతారని, ఈ సంస్థ తో ఒప్పందం ఒక గేమ్‌ చేంజర్‌ఃః అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఃః బైజూస్‌ ఃః సంస్థ నిర్వాహకుడు రవీంద్ర తీరు తీవ్ర దుమారం లేపుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులే టార్గెట్‌ గా తిరుపతి , పరిసర ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి… ః మీ పిల్లలు ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఉత్తమమైన విద్యను అందించాలి. అందుకే అత్యుత్తమ, జాతీయ స్థాయి లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో అత్యాధునిక పద్ధతిలో లైవ్‌ క్లాసులను నిర్వహిస్తున్నాం. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఉన్నత పోలీసు అధికారులు గానో ఎదగాలంటే మా ఈ బైజుస్‌ ద్వారా అందిస్తున్న కంటెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చెబుతున్న తరహాలోనే అతి తక్కువ ధరలకే మీకు బైజుస్‌ కంటెంట్‌ ను అందిస్తున్నాం. మా కంటెంట్‌ ఒక్కసారి వింటే చాలు…పిల్లల మదిలో అతి సులభంగా పాఠాలు నిలిచిపోతాయి. లాప్టాప్‌ , టాబ్‌ మేమే ఏర్పాటు చేస్తాం . పైగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మా కంటెంట్‌ ను కొని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు అందిస్తోంది అంటే మా నాణ్యత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు ఒకసారి తిరుపతి లోని మా ఆఫీస్కు రండిః అంటూ ఆశపెడుతున్నారు. వచ్చాక…ఒక లక్ష నుంచి మొదలెట్టి 70 నుంచి 60 వేలకు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. పైగా బజాజ్‌ ఫైనాన్స్‌ తో జతకట్టి ఫీజు చెల్లించేందుకు ఈఎంఐ సౌకర్యాలనూ వారే కల్పించడం గమనార్హం. వీటితో పాటు లాప్టాప్‌ , ట్యాబ్లను బలవంతంగా విద్యార్థులతో కొనిస్తున్నారు. ఇలా ఒక్క తిరుపతి నగరంలోనే 1000 మందికి పైగా వసూలు చేసినట్లు ప్రజాసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా ఇప్పటికే 70 కోట్లకు పైగా తిరుపతిలో వసూలు చేసినట్లు విద్యార్థి సంఘాల నేతల విమర్శలు.ప్రీ రికార్డింగ్‌ వీడియోలతో బురిడీకంటెంట్ను లైవ్‌ లో ఇస్తామని హామీ ఇచ్చిన బైజుస్‌ నిర్వాహకులు తీరా ఫ్రీ రికార్డింగ్‌ వీడియోలను రోజుకు గంట నుంచి రెండు గంటల పాటు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే వారిని నిర్వాహకులు బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదే విషయమై బైజుస్‌ యాజమాన్యాన్ని నిలదీసిన ఏడుమంది విద్యార్థిసంఘాల నాయకులపై తిరుపతి అలిపిరి పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకూ వెనకాడకపోవడం గమనార్హం. రవీంద్రపై చర్యలు తీసుకోవాలి : పి మురళి ,సీపీఐ జిల్లా కార్యదర్శి బైజుస్‌ కంటెంట్‌ పేరుతో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులను మభ్యపెట్టి గోల్మాల్కు పాల్పడుతున్న బైజుస్‌ రవీంద్ర పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుపతి నగరం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడుతున్న బైజుస్‌ యాజమాన్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఎందుకు అంత ప్రేమో అర్థం కావడం లేదు. నాసిరకం ట్యాబ్లు, లాప్టాప్‌ లంటూ ఇప్పటికే వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. బైజూస్‌ కంటే ఉపాధ్యాయులే ఎన్నో రెట్లు మేలు : అవనిగడ్డ పద్మజ, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శిబైజుస్‌ కంటే ఉపాధ్యాయులే ఎన్నో రెట్లు మేలు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. డిజిటల్‌ కంటెంట్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప అందువల్ల ఉ త్పన్నవుతున్న సమస్యల్ని పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయల స్కాం కు పాల్పడుతున్న బైజ్యూస్‌ సంస్థ పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ సంస్థను వెనకేసుకు రావడం లో ఆంతర్యం ఎంటో అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

➡️