ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలిస్వీప్‌ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలిస్వీప్‌ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలిస్వీప్‌ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌ప్రజాశక్తి- తిరుపతి సిటీ: జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలని సోమవారం పట్టణంలో నిర్వహించిన స్వీప్‌ అవగాహనా కార్యక్రమ ర్యాలీని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర జి.లక్ష్మి శ, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం. ధ్యాన చంద్ర, నగర పాలక కమిషనర్‌ అదితి సింగ్‌ జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా ముఖ్యంగా స్వీప్‌ యాక్టివిటీ (సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోల్‌ పార్టిసిపేషన్‌) ఓటరుకు అవగాహన పెంచి ఓటు వేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు వారి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుని ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించేలా స్వీప్‌ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటర్‌కు అవగాహన కల్పించేలా స్వీప్‌ యాక్టివిటీని అధికారులందరం కలిసి చేపడుతున్నామని తెలిపారు. ఈ యాక్టివిటీ ద్వారా పలు రకాల ర్యాలీలు చేపట్టి ప్రతి ఒక్కరిలో ఓటింగ్‌ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈర్యాలీ తిరుపతిలోని ఎస్‌వి యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో స్వీప్‌ నోడల్‌అధికారి మురళీకష్ణ, జిల్లా అధికారులు, మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️