భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైంది.. – ఆచార్య సూర్యనారాయణ

భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైంది.. – ఆచార్య సూర్యనారాయణప్రజాశక్తి – క్యాంపస్‌ : భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైందని ఆచార్య సూర్య నారాయణ అన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11గంటలకు ఆచార్య జాస్తి సూర్యనారాయణ పేరుతో ఈ ధర్మనిధి ఉపన్యాస కార్యక్రమం యస్వీయూ సెనేట్‌ హాల్లో నిర్వహించారు. ‘సంస్కత సాహిత్యం ఉత్తర రామ చరిత వైశిష్ట్యం’ అనే అంశంపై జాతీయ సంస్కత విశ్వవిద్యాలయం ఆచార్యులు కొంపెల్ల రామ సూర్యనారాయణ ప్రసంగించారు. వర్సిటీ ఇన్‌ చార్జి వీసీ ఆచార్య జీఎం సుందరవల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు తెలుగుశాఖ గొప్పదనాన్ని వివరించారు. ప్రధానవక్త , సంస్కత విద్యాపీఠం ఆచార్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ సంస్కత భాష కంటే తెలుగు భాషలో కవిత్వం రాయడం కష్టమని, తెలుగులో కవిత్వం రాయాలంటే సంస్కత, తెలుగు భాషల్లో పాండిత్యం వుండాలన్నారు. వేదసాహిత్యం భారతీయ సాహిత్యానికి నీటి చెలమని, పురాణ సాహిత్యం ప్రేమమయమని, కావ్యాలు రసమయమని అన్నారు. భవభూతి రాసిన ఉత్తరం రామచరితం కరుణరస భరితమైందని , ‘ఏకో రసం: కరుణమేవ’ అనే విధంగా కవి మలిచారన్నారు. సీతారాముల పరస్పర అనురాగాన్ని ,అరమరికలు లేని దాంపత్య జీవితాన్ని హద్యంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఆర్‌. రాజేశ్వరమ్మ, ఆచార్య శ్రీనివాసులుర్డెిె, ఆచార్య దామోదర నాయుడు, ఆచార్య సర్వోత్తమ రావు, డాక్టరు సునీల్‌, డాక్టరు ఆదిశేషయ్య, డాక్టరు అశోక్‌ , పరిశోధకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

➡️